నేను ఇంకా చావలేదు.. కన్నీరు పెట్టుకుంటూ Samantha ఆవేదన
మయోసైటిస్‌పై సమంత భావోద్వేగానికి గురైంది. యశోద మూవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ కన్నీరు పెట్టుకుంది.
దిశ, వెబ్‌డెస్క్ : మయోసైటిస్‌పై సమంత భావోద్వేగానికి గురైంది. యశోద మూవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ కన్నీరు పెట్టుకుంది. ఇప్పటికీ నేను ఇంకా చావలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను మాట్లాడుతూ.. కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. నేను దీనిపై పోరాటం చేయాలి, ఒకానొక సమయంలో నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఇంత వరకు ఎలా వచ్చానో అని అనిపిస్తుందని భావోద్వేగానికి లోనైంది. అలాగే దీనిపై ఫైట్ చేస్తాను, ప్రస్తుతం బానే ఉన్నట్లు తెలిపింది.