సమంతకు మళ్లీ తిరగబడిన వ్యాధి.. ఆక్సీజన్ మాస్క్ పెట్టుకున్న వీడియో షేర్ చేయడంతో షాక్‌లో ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది మయోసైటీస్ కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది మయోసైటీస్ కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తానని ఇటీవల చెప్పినప్పటికీ ఒక్క మూవీకి తప్ప మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్కోసారి హద్దులు చేరిపేసి బోల్డ్ పిక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అలాగే ఓ హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ చేసి అందులో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుపుతోంది. దీంతో అంతా ఆమెకు మయోసైటీస్ వ్యాధి తగ్గిందని అనుకున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, సామ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో కొన్ని థెరపీలు తీసుకుంటున్నట్లు తెలుపుతూ.. ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని ఓ మిషీన్లో పడుకుంది. బాడీ మొత్తానికి థెరపీ తీసుకుంది. అలాగే ‘‘నేను ఈ చికిత్సలను నిజంగా ఆనందిస్తున్నాను! అవి మనస్సును, శరీరం రెండింటికీ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి: 1. కొల్లాజెన్ బెడ్: చర్మం స్థితి స్థాపకతను మెరుగుపరుస్తుంది. యవ్వన రూపాన్ని ప్రోత్సహిస్తుంది.
2. హైపర్బేరిక్ థెరపీ: ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది, వైద్యం వేగవంతం చేస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 3. క్రయోథెరపీ: మంటను, నొప్పిని తగ్గించి శక్తి స్థాయిలను పెంచుతుంది. నా ఛానెల్‌ని సందర్శించండి, టేక్ 20, ఇక్కడ మేము మీ మనస్సు, శరీరాన్ని మెరుగుపరచడానికి వివిధ పద్ధతులను కనుగొంటాము’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ సమంత వీడియో వైరల్ అవుతుండగా అది చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మళ్లీ వ్యాధి తిరగబడటం వల్లే ఇలాంటి థెరపీలు తీసుకుంటుందా?లేక తెలియజేయడానికా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం స్కిన్ కేర్, ఫిజికల్ హెల్త్‌కు సంబంధించిన విషయాలు చెప్పండి అని కామెంట్లు పెడుతున్నారు.