నేను ఎలాంటి తప్పు చేయలే.. మ్యారేజ్ లైఫ్‌లో నిజాయితీగా ఉన్నా.. విడాకులపై నోరువిప్పిన సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే టాలీవుడ్ లక్కీ

Update: 2024-06-07 09:54 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా మారిపోయింది. ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అవ్వడంతో, సమంత అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. వరసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం, సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిపోయింది.

ఇక అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, సంతోషంగా ఉంటుంది అనుకునే సమయంలో తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయింది. దీంతో అభిమానులందరూ షాక్‌లో మునిగిపోయారు. అసలు వీరు విడిపోవడానికి గల కారణం తెలియక చాలా మంది ఇప్పటికీ అయోమయంలోనే ఉన్నారు. వీరి విడాకుల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వస్తుంటాయి. అయితే డివోర్స్ తర్వాత సామ్ పుష్ప సినిమాలో ఊ అంటావా.. సాంగ్ చేసి చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సాంగ్ చేయడంపై సామ్ ఓపెన్ అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె షాకింగ్ విషయాలు బయటపెట్టింద. సమంత మాట్లాడుతూ.. డివోర్స్ తీసుకున్న సమయంలోనే నాకు పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. దీంతో మా కుటుంబ సభ్యులు ఈ సాంగ్‌లో నువ్వు చేయకు, నీపై చాలా విమర్శలు వస్తాయని చెప్పుకొచ్చారు. కానీ నేను ఐటెం సాగ్ చేయకుండా ఉండటానికి కారణం కనిపించలేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా మ్యారేజ్ లైఫ్‌లో కూడా నేను నిజాయితీగానే ఉన్నా .. అలాంటప్పుడు నేను అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఐటమ్ సాంగ్‌కు ఒకే చెప్పాను అని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News