మీరు ప్రయత్నిస్తారా.. ఆ వీడియో పోస్ట్ చేసిన సమంత
సమంత గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ప్రతీది షేర్ చేసుకుంటుంది. ఇక చాలా రోజుల నుంచి
దిశ, వెబ్డెస్క్ : సమంత గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ప్రతీది షేర్ చేసుకుంటుంది. ఇక చాలా రోజుల నుంచి ఈ అమ్మడు మయైసైటీస్ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.
దీంతో చాలా రోజుల నుంచి సమంత సోషల్ మీడియాకు దూరమైంది. కాగా, ఇటీవల సమంత మయోసైటీస్ నుంచి కాస్త కోలుకున్నట్లు కనిపిస్తుంది. వ్యాధి నుంచి బయట పడిన తర్వాత అప్పుడప్పుడు సామ్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను వర్క్ ఔట్ చేస్తుండగా, వీడియో తీసి ఇది చూస్తే సరదగా, ఫన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కధా, కానీ అది నిజం కాదు. దీన్ని మీరు ప్రయత్నిస్తారా అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఇక దీనికి పలువురు పలు విధాలుగా స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. కాగా, వీడియోపై మీరు ఓ లుక్ వేయండి.