ఏడుస్తున్నప్పుడు కూడా దయను కలిగివుండాలా? సమంత పోస్ట్ వైరల్
స్టార్ నటి సమంత మరో ఎమెషనల్ పోస్ట్‌తో నెట్టింట దర్శనమిచ్చింది.
దిశ, సినిమా : స్టార్ నటి సమంత మరో ఎమెషనల్ పోస్ట్‌తో నెట్టింట దర్శనమిచ్చింది. కొంతకాలంగా 'మయోసైటిస్' వ్యాధితో బాధపడుతున్న ఆమె ఇటీవల " యశోద " సినిమాతో సక్సెస్ అందుకుని మళ్లీ యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం "శాకుంతలం" సినిమా డబ్బింగ్ పనుల్లో పాల్గొంటున్న సామ్ ఆ చిత్రంలోని ఓ భంగిమను చూపిస్తూ ఇన్‌స్టావేదికగా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ''శాకుంతలం' చిత్రంలో కష్టమైన అంశం ఏమిటంటే..నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు కూడా దయతో కూడిన భంగిమను కొనసాగించడం. దయ అనేది నాకు సంబంధించిన విషయం కాదు. అందుకు సాషాను కూడా వెంట తీసుకెళ్లి ఉండాల్సింది' అంటూ తనతో పాటు సోఫాపై భిన్నమైన యాంగిల్‌లో పడుకున్న పెంపుడు కుక్క ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా ఆమె అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతూ పాజిటీవ్ కామెంట్లు చేస్తున్నారు. ఇక గుణశేఖర్ తెరకెక్కించిన 'శాకుంతలం' ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.