అలాంటి డ్రెస్‌లో దర్శనం ఇచ్చిన ఉర్ఫీ.. సమంత రియాక్షన్ ఇదే!
ఉర్ఫీ జావేద్ ఆమె తన ఫ్యాషన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక డిఫరెంట్ స్టైల్ డ్రెస్‌తో కనిపిస్తూ అందరినీ తన వైపు తిప్పుకుంటుంది. మారుతున్న ప్రపంచానికి అనుగునంగా కొత్త ట్రడ్తో సరికొత్తగా కనిపిస్తుంటుంది
దిశ, సినిమా: ఉర్ఫీ జావేద్ ఆమె తన ఫ్యాషన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక డిఫరెంట్ స్టైల్ డ్రెస్‌తో కనిపిస్తూ అందరినీ తన వైపు తిప్పుకుంటుంది. మారుతున్న ప్రపంచానికి అనుగునంగా కొత్త ట్రడ్తో సరికొత్తగా కనిపిస్తుంటుంది. వెరైటీ ఉండటంలో ఈమెను మించిన బ్యూటీ లేదు. ఫ్యాషన్‌కు పెట్టింది పేరు ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఉర్ఫీ జావేద్ రెడ్ కార్పెట్ ఈవెంట్లో తన డ్రెస్‌తో మ్యాజిక్ చేసింది. ఆమె ధరించిన గౌన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఈవెంట్లో ఉర్ఫీ తన ప్రిన్సెస్ గౌన్ చూడటానికి సాధరణంగా కనిపించినా, ఆమె డ్రెస్‌పై ఉన్న పసుపు రంగు పూలు రియలిస్టిక్‌గా వికసిస్తూ కనిపిస్తాయి. అలాగే కెమెరాలకు ఫోజులిచ్చే టప్పుడు కృత్రిమ సీతాకోక చిలుకలు గాల్లోకి ఎగరడం అక్కడున్న వారిని అబ్బురపరిచింది. దీంతో చాలా రోజుల తర్వాత ఉర్పీ ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రకృతి అందాన్ని మేళవించి ఫ్యాషన్‌ని ఆవిష్కరించినందుకు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ఈమె డ్రెస్‌కు సెలబ్రిటీస్ సైతం మంత్రముగ్ధులు అయిపోతున్నారు.
సమంతా రూత్ ప్రభు ప్రత్యేకంగా ఉర్ఫీ గౌను అందానికి ముగ్ధులయ్యారు. బ్యూటిఫుల్ ఉర్పీ అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేశారు. అంతే కాకుండా, ఆ డ్రెస్‌పై తన ఇష్టాన్ని తెలియజేస్తూ హార్ట్ ఎమోజీస్ షేర్ చేసింది. అలాగే మృణాల్ లవ్ అంటూ కామెంట్ చేయగా, అనుపమ.. ఫైర్ సింబల్స్ షేర్ చేసింది.