శత్రువులుగా మారిపోయిన సమంత, రవితేజ.. అసలు వారి మధ్య ఏం జరిగింది?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య సామ్‌కు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ వస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని ట్రోలర్స్ పెద్దదిగా చేసి చూపడమే కాకుండా ట్రోలింగ్‌కు

Update: 2024-06-01 09:58 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య సామ్‌కు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ వస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని ట్రోలర్స్ పెద్దదిగా చేసి చూపడమే కాకుండా ట్రోలింగ్‌కు గురి చేస్తున్నారు. అయితే తాజాగా సామ్‌కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండస్ట్రీలో ఎక్కువగా క్లోజ్‌గా లేని వ్యక్తులు, కలిసి నటించని నటీనటులు కూడా ఉంటారు. అందులో సమంత, రవితేజ కూడా ఉంటారు. వీరు కలిసి ఏ సినిమాలో నటించలేదు. వీరి మధ్య క్లోజ్ నెస్ ఉన్నట్లు కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే వీరు బద్ధ శత్రువులు అంటూ ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరు కలిసి ఎక్కడా మాట్లాడుకున్న సందర్భం మనం చూడలేదు. వీరు ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు. అయితే వీరి కాంబినేషన్‌లో సినిమా రాకపోవడానికి కారణం వీరి మధ్య ఉన్న శత్రుత్వమేనంట. అసలు విషయంలోకి వెలితే.. రవితేజ హీరోగా అంజలి, శృతిహాసన్ హీరోయిన్స్‌గా వచ్చిన సినిమా బలుపు. ఇది పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. అయితే ఈ సినిమాలో మొదటగా సమంత అనుకున్నారంట. ఇక ఈ విషయాన్ని మేకర్స్ రవితేజకు చెప్పగానే, ఆ హీరోయిన్ అస్సలే వద్దూ అంటూ తెగేసి చెప్పాడంట. అలాగే సమంత కూడా రవితేజ అనగానే నేను సినిమా చేయను అంటూ ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే వీరిద్దరు అంతలా చేయను అని కొట్టిపారేసే వరకు ఎందుకు వచ్చింది. వీరిద్దరి మధ్య గొడవలు ఎక్కడ మొదలు అయ్యాయో కూడా తెలియడం లేదంట. అంతే కాకుండా గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నట్లు చిత్రపరిశ్రమలో గుస గుసలు వినిపిస్తున్నాయి. కానీ దీని గల కారణం ఏంటో ఎవ్వరికీ తెలియడం లేదు. కాగా, ఇది నిజమో లేక పుకారో కూడా తెలియదు అంటున్నారు నెటిజన్స్.


Similar News