Samantha,Naga Chaithanya మళ్లీ కలవనున్నారా..! Samantha చేసిన పనికి బుర్ర బద్దలుకొట్టుకుంటున్న నెటిజన్లు..?
సమంత, నాగచైతన్య విడాకుల అనంతరం ఎవరి లైఫ్ వారు లీడ్ చేసుకుంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: సమంత, నాగచైతన్య విడాకుల అనంతరం ఎవరి లైఫ్ వారు లీడ్ చేసుకుంటున్నారు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట.. 2017 లో పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుని.. ఏవో మనస్పర్థల కారణంగా 2021 లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లి ఫొటోలను బయటకు కనిపించకుండా Archive లో పెట్టిన సమంత.. తాజాగా వారి మ్యారేజ్ ఫొటోని మళ్లీ Un Archive చేసింది. ఆ వెంటనే మళ్లీ కనిపించకుండా పోయింది ఆ పోస్ట్. దీంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది. సామ్ చేసిన పనికి అర్థం ఏంటి..? చైతుని మర్చిపోలేక పోతుందా అంటూ నెట్టింట్లో చర్చలు మొదలు పెట్టారు. అంతే కాకుండా.. సామ్, చైతుకి విడాకులు అయ్యి రెండేళ్లు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు వీళిద్దరి లైఫ్‌లోకి మరొకరు రాలేదు. అంటే సమంత, చైతన్యలు మళ్లీ కలుసుకునే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని అంటున్నారు. అయినా రెండేళ్ల తర్వాత పెళ్లి ఫొటో Un Archive చేసిందంటే అసలు విషయం ఏమై ఉంటుంది అంటూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు నెటిజన్లు.
ఇవి కూడా చదవండి : Nagarjuna తో కొట్లాటకు దిగిన Venkatesh..