ఆయనతో నా బంధం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది.. సమంత కామెంట్స్ వైరల్
బ్యూటిఫుల్ సమంత అనారోగ్యం కారణంగా సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ తీసుకుంది. వెకేషన్స్ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం సిటాడెల్ ప్రాజెక్ట్ కంప్లీట్
దిశ, సినిమా: బ్యూటిఫుల్ సమంత అనారోగ్యం కారణంగా సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ తీసుకుంది. వెకేషన్స్ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం సిటాడెల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న సామ్..డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్ తో మంచి ఫ్రెండ్ షిప్ మెయింటేన్ చేస్తుంది. నిజానికి ఈ బ్యూటీ తన లైఫ్ లో ప్రేమ, పెళ్లి కన్నా స్నేహాన్ని ఎక్కువగా నమ్మినట్లు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, చిన్మయితో ఆమెకున్న బంధాన్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. రాహుల్ ను ఎంత నమ్ముతుందో చెప్తున్న వీడియో చూస్తుంటే ఇది నిజమే అనక తప్పదు కూడా.
చిన్మయి హోస్ట్ చేస్తున్న ఓ ప్రోగ్రామ్ కు అటెండ్ అయిన సామ్.. ఆమె చూపించిన గ్రూప్ ఫొటో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇందులో వెన్నెల కిశోర్, రాహుల్ తో పాటు వీరిద్దరూ ఉన్నారు. ఈ పిక్ గురించి వివరిస్తూ.. ' నేను అత్యంత ఎక్కువగా నమ్మే వ్యక్తి రాహుల్. మర్డర్ చేసినా కూడా తనతో చెప్పేస్తా. ఎందుకంటే అతను నన్ను జడ్జ్ చేయడు. చాలా ట్రూగా ఉంటాడు. ఆయనతో నా బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ' అని చెప్పుకొచ్చింది.