ప్రభాస్ సొంతూరు పేరు ఏంటో తెలుసా? ఫ్యామిలీ డీటెయిల్స్..!!
‘ఈశ్వర్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. సినీ కెరీర్ ను ప్రారంభించాడు రెబల్ స్టార్ ప్రభాస్.
దిశ, సినిమా: ‘ఈశ్వర్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. సినీ కెరీర్ ను ప్రారంభించాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. ‘రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, మిస్టర్ ఫర్ ఫెక్ట్, మిర్చి, రెబల్, యోగి, బాహుబలి, సలార్’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ డూపర్ చిత్రాల్లో నటించి.. ఇప్పటికి హిట్ల మీద హిట్లు కొడుతూ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ ‘‘కల్కి 2898’, రాజా సాబ్’’ సినిమాల్లో నటిస్తున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రభాస్ కు కోట్లలో అభిమానులున్న విషయం తెలిసిందే. కాగా ఈ హీరో సొంతూరు ఏంటని గూగుల్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారుఫ్యాన్స్. వివరాల్లోకెళ్తే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామానికి చెందినవాడు. ఈ హీరో ఉప్పలపాటి సూర్యనారాయణరాజు - శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించారు. తల్లితండ్రులకు ప్రభాస్ రెండో సంతానం. ప్రభాస్‌కు ప్రబోధ్ అనే బ్రదర్, ఒక చెల్లెలు ఉన్నారు. రెబల్ తన ప్రాథమిక విద్యను డి. ఎన్. ఆర్ స్కూల్ భీమవరంలో కంప్లీట్ చేశారు. హైదరాబాదులోని ఇంజినీరింగ్ కాలేజైన శ్రీ చైతన్య లో B. tech పూర్తి చేశారు.