సీరియల్ నటితో పెళ్లిపై స్పందించిన రవికృష్ణ.. అందుకే రొమాన్స్ చేశానంటూ ఆసక్తికర కామెంట్స్
సీరియల్ నటీనటులతో పాటు, హీరోహీరోయిన్లు కూడా డేటింగ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
దిశ, సినిమా: సీరియల్ నటీనటులతో పాటు, హీరోహీరోయిన్లు కూడా డేటింగ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంతమంది క్లోజ్‌గా ఉన్నప్పటికీ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాంటి వారిలో బుల్లితెర నటి నవ్య స్వామి, రవికృష్ణ జంట కూడా ఒకటి. అయితే వీరిద్దరు కలిసి సీరియల్‌లో నటించారు. అంతేకాకుండా పలు షోస్‌ల్లోనూ జంటగా పాల్గొనడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, రవికృష్ణ నవ్యస్వామితో పెళ్లిపై స్పందించాడు.
అసలు విషయంలోకి వెళితే.. మోడల్‌గా కెరీర్ స్టార్ చేసిన నవ్యస్వామి బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రవికృష్ణతో సిరీయల్స్, షోస్‌లో జంటగా రొమాన్స్ చేసి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రజెంట్ వీరిద్దరు సినిమాల్లో నటిస్తున్నారు. అయినప్పటికీ పెళ్లి వార్తలు ఆగడం లేదు.
ఈ క్రమంలో.. రవికృష్ణ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. ‘‘ నవ్య నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ లేదు. ఆ విషయంలో మాకు క్లారిటీ ఉంది. నేను గతంలో నవ్యతో చేసినవన్నీ స్కిట్ల కోసం మాత్రమే. రొమాన్స్ కూడా అందుకే చేశాను. కానీ వాటిని చూసిన వారంతా మా గురించి ఏవేవో అనుకుంటున్నారు. అందుకే క్లారిటీ ఇస్తున్నాను. మా పెళ్లి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు’’ అని చెప్పుకొచ్చాడు.