కొత్త ప్రారంభాలంటూ యాంకర్ రష్మి ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పెళ్లి చేసుకోబోతోందా?
బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన రష్మి తన అందం, అభినయం, మాటలతో స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
దిశ, సినిమా: బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన రష్మి తన అందం, అభినయం, మాటలతో స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా యాంకర్‌గా రాణిస్తూనే పలు సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే రష్మీ, సుధీర్ చేసిన షోలకు ప్రత్యేకమైన ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే రష్మీ ప్రజెంట్ పలు షోస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల రష్మీ ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆమె తాతయ్య చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతూ పలు పోస్టులు పెడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రష్మి తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. బ్లూ కలర్ డ్రెస్‌లో ఉన్న పిక్స్ పెట్టి సెప్టెంబర్ మొదలైంది. కొత్త ప్రారంభాలకు.. కొత్త జ్ఞాపకాలు సృష్టించేందుకు’’ అని రాసుకొచ్చింది. ఇక రష్మీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన కొందరు సుధీర్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని కామెంట్ పెట్టగా.. మరికొందరు మాత్రం కొత్త ప్రారంభాలంటే పెళ్లి చేసుకోబోతున్నావా? అని అంటున్నారు.