లెజెండ్రీ క్రికెటర్‌తో రాసలీలలు.. పెళ్లి కాకముందే తల్లయిన హీరోయిన్..

సినీ, క్రికెటర్ రంగాల మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-07-02 13:12 GMT

దిశ, సినిమా: సినీ, క్రికెటర్ రంగాల మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే క్రికెటర్స్ సినీ తారలతో కలిసి పలు యాడ్స్‌లో, ఈవెంట్స్‌లో కలుసుకోవడం వల్ల వారి మధ్య పరిచయాలు ఏర్పడి.. ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. వాళ్లలో అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ, పటౌడి- షర్మిలా టాగోర్, యువరాజ్ సింగ్- హాజెల్ కీచ్ ఇలా చాలా మంది ఉన్నారు. అయితే లెజెండరీ క్రికెటర్‌తో కలిసి స్టార్ హీరోయిన్ సహజీవనం చేసి పెళ్లి కాకుండానే తల్లి అయిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అసలు వివరాల్లోకి వెళితే..

అప్పట్లో క్రికెట్‌ను శాసించిన స్టార్ బ్యాట్స్‌మన్ వివియన్ రిచర్డ్స్ అందరికీ సుపరిచితమే. ఎన్నో బౌండరీస్ కొట్టి స్టార్ క్రికెటర్‌గా రాణించాడు. అయితే అతను ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో నీనా గుప్తాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనం చేయడం వరకు వెళ్లింది. అలా సహజీవనం చేస్తున్న క్రమంలో నీనా గుప్తా పెళ్లి కాకుండానే ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాప ఎవరో కాదు బాలీవుడ్‌లో రాణిస్తున్న నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా.

అయితే రిచర్డ్స్ మరియు నీనా గుప్తా చాలా కాలం తమ అనధికార దాంపత్యాన్ని కొనసాగించారు. కానీ తర్వాత కొన్ని కారణాలతో ఇద్దరు ఇష్టపూర్వకంగా విడిపోయారు. కాగా రీచర్డ్స్‌ మళ్లీ పెళ్లి చేసుకొని తన దారి తాను చూసుకున్నాడు. కానీ నీనా మసాబా గుప్తాకు సింగిల్ పేరేంట్‌గా ఉంటూ తన ఆలన పాలన చూసుకుంటుంది. తన కూతురు కోసం వేరే పెళ్లికి దూరంగా ఉన్నది. ఇక కూతురు పెద్దదై తన పెళ్ళి జరిగేంత వరకు ఒంటరిగా ఉండి తర్వాత ఆమె వేరే పెళ్లి చేసుకున్నారు.

Similar News