Ram Charan-Upasana: బుజ్జి వినాయకుడితో రామ్ చరణ్-ఉపాసన.. ఆకట్టుకుంటోన్న పోస్ట్

రామ్ చరణ్-ఉపాసన గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-09-12 07:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్-ఉపాసన గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరిద్దరు కొంతకాలం ప్రేమలో ఉండి.. పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. కెరీర్‌లో సెట్ అయ్యాక పిల్లల ప్లాన్ చేసుకుని, దాదాపు పదకొండేళ్ల తర్వాత పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అపోలో ఆస్పత్రిలో జన్మించిన పాపను చూసి రామ్ చరణ్ ఎంతో ముచ్చటపడిపోయాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సంబరం గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పట్టరాని ఆనందంలో మునిగితేలిపోయాడు. మెగా ప్రిన్సెస్ రాకతో మొత్తానికి మెగా ఫ్యామిలీలో సంబరాలతో పాటు అన్ని శుభాలే జరుగుతున్నాయని అభిమానులు భావిస్తున్నారు.

ఎందుకంటే.. ఎందుకంటే క్లింకార జన్మించాకే మెగా ఫ్యామిలీలోకి కొత్త కోడలు లావణ్య వచ్చింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో మెగా ఫ్యాన్స్ క్లింకార మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన లక్కీ గర్ల్ అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ - ఉపాసన సంప్రదాయ దుస్తుల్లో వినాయకుడ్ని చేతిలో పట్టుకుని ఫొటో దిగారు. దీనికి సంబంధించిన ఫొటోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.  


Similar News