Rakul Preet Singh: నెపోటిజంపై రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో దూసుకుపోవడంతో దర్శక, నిర్మాతలు రకుల్ బాట పడ్డారు. తర్వాత మెల్లిమెల్లిగా ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎక్కువగా సినిమా ఆఫర్లు రావడం లేదు. ఇకపోతే ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రకుల్ ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనే పదం ఎక్కువగా వినిపిస్తుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ దీనిపై స్పందించి.. ‘‘నా జీవితంలో నెపోటిజం కారణంగా ఎన్నో చాన్స్‌లు వదులుకున్నాను. సినీ పరిశ్రమలో నెపోటిజం ఉన్నమాట నిజమే. అవకాశాలు కోల్పోయానని నేను ఎప్పుడు బాధపడలేదు. నా ఫాదర్ సలహాలు, సూచనలు నాకు చాలా నేర్పాయి. చిన్న చిన్న విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. చాన్స్‌లు మిస్ అవ్వడం అనేది మన లైఫ్‌లో ఒక పార్ట్. మనకు దక్కని వాటి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. నేను వ్యక్తిగతంగా ఎదగడం కోసం మాత్రమే ఆలోచిస్తాను. కానీ ఒక స్టార్ కిడ్‌కు వచ్చినన్నీ అవకాశాలు మిగతావారికి రావడం కష్టం’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.