హమ్మయ్య.. రజినీకాంత్ సేఫ్.. సూపర్ స్టార్ హెల్త్‌పై అప్ డేట్ ఇచ్చిన భార్య

సూపర్ స్టార్ రజినీకాంత్ గత రాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Update: 2024-10-01 08:45 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ గత రాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో హాస్పిటల్‌‌లో చేర్పించినట్లు తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆయనకు నేడు ఎలక్టివ్ ప్రొసీజర్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే గుండెకు సంబంధించిన కొన్ని టెస్టులు కూడా చేయనున్నట్లు సమాచారం. ఇక రజినీ కాంత్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

తన అభిమాన హీరో క్షేమంగా బయటకు రావాలంటూ దైవాన్ని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ శుభవార్త అందింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక రజినీ సతీమణి లతా స్పందిస్తూ.. ‘ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ఫ్యాన్స్‌కు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మీలాంటి అభిమానులు దొరకడం మా అదృష్టం’ అని చెప్పుకొచ్చారు. దీంతో రజినీకాంత్ క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా.. రజినీ కాంత్ ‘వెట్టైయాన్’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  


Similar News