మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అప్పుడే సంతోషంగా ఉంటారు.. రిక్వెస్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ప్రజెంట్ వరుస చిత్రాలు చేస్తుంది.
దిశ, సినిమా: బాలీవుడ్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ప్రజెంట్ వరుస చిత్రాలు చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ.. తన చిన్నప్పటి ఫొటో, అలాగే 2000 సంవత్సరంలో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఫొటో రెండూ పక్కపక్కనే పెట్టి.. ఓ ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేసింది. ‘నా 9 ఏళ్ల వ్యక్తిని ట్రోల్ చేయోద్దు. యుక్తవయస్సు అమ్మాయి లుక్ ఆమె ధరించిన దుస్తులపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎడమ వైపున ఉన్న ఫొటోలో నాకు 9ఏళ్లు. అప్పుడు "బాయ్ కట్" హెయిర్‌స్టైల్‌తో చాలా ఇబ్బందికరంగా ఉన్నాను. అయితే.. అప్పుడు స్కూల్ ఏజ్ కాబట్టి అంతగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఇక రైట్ సైడ్ ఫొటో విషయానికి వస్తే.. అది నా 17 ఏళ్ల ఫొటో.
2000 సంవత్సరంలో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న రోజుల్లో తీసిన ఫొటో. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. అప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. 25 ఏళ్లు గడుస్తున్నా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలమే. ఇప్పుడు నా చిన్నతనాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం ఎంత ఆనందంగా ఉందో తెలుస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఈ రోజు మీరు ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగండి. మీ చిన్నప్పటి ఫొటోను షేర్ చేస్తూ.. మీ చిన్నతనం మీ కోసం ఏమి చేసిందో కామెంట్స్‌లో పెట్టిండి’ అంటూ చెప్పుకొచ్చింది.