ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు హీరోయిన్ ఫైనల్ ?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా హిరోయిన్ ఎవరోనంటూ అభిమానుల ఎదురుచూపులకు తెరపడిందన్న టాక్ వినిపిస్తుంది
దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా హిరోయిన్ ఎవరోనన్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడిందన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో 'సప్తసరాగాలు దాటి' ఫేం రుక్మిణి వసంత్ హీరోయిగా నటించనుందని సమాచారం. మూవీ టీమ్ ఆమెను ఇప్పటికే ఫైనల్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ కథనం. బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్న ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేసిన 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా హిట్ టాక్ తో ఫ్యాన్స్ అంతా ఇప్పుడు 'దేవర' మ్యానియాలో మునిగితేలుతున్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్.. 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.