పెళ్లైన పది రోజులకే ప్రెగ్నెంట్.. ఇక నుంచి అలా చేయనంటూ సోనాక్షి సిన్హా షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా నటుడు జహీర్ ఇక్బాల్‌‌తో ప్రేమాయణం నడిపింది.

Update: 2024-07-06 08:38 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా నటుడు జహీర్ ఇక్బాల్‌‌తో ప్రేమాయణం నడిపింది. ఇటీవల పెద్దలను ఒప్పించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. గ్రాండ్‌గా రిసప్షన్ నిర్వహించి సినీ సెలబ్రిటీలకు పార్టీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఈ అమ్మడు ముస్లింగా మారుబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించడంతో వాటికి చెక్ పడింది. ఇక సోనాక్షి తండ్రి శత్రుష్ను సిన్హాకు ఆరోగ్యం బాలేకపోవడంతో భర్తతో కలిసి హాస్పిటల్‌కు వెళ్లింది. దీంతో సోనాక్షి ప్రెగ్నెంట్ వార్తలు జోరందుకున్నాయి. అందుకే ఈ కొత్త జంట హాస్పిటల్‌కి వెళ్లారనే ప్రచారం గత కొద్ది కాలంగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ వార్తలపై స్పందించి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ‘‘జీవితం మనం అనుకున్నంత గొప్పగా ఉండదు. అలాగే నా పెళ్లి తర్వాత జీవితంలో పెద్ద మార్పులేమి జరగినట్టు నాకు అనిపించలేదు. ఇప్పుడు ఎలా ఉందో.. పెళ్లికి ముందు కూడా అలాగే ఉండేది. అయితే నా భర్తతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. తొందరలో ఇద్దరం షూటింగ్స్‌లోనూ పాల్గొన బోతున్నాము హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే నేను మా నాన్నకు బాలేదని హాస్పిటల్‌కు వెళ్లాను. అప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్ అనే వార్తలు వస్తున్నాయి. అదొక్కటే మార్పు జరిగింది. ఇక నుంచి నేను నా భర్తతో కలిసి హాస్పిటల్ వైపుకు అస్సలు వెళ్లను. ఎందుకంటే అలా వెళ్లడం వల్ల నేను ప్రెగ్నెంట్ అని అందుకే వెళ్తున్నామని అనుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి వెళ్లాలనుకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చింది.


Similar News