నా బుజ్జిని కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్నానంటూ ప్రభాస్ పోస్ట్.. ఆనందంలో ఫ్యాన్స్

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు.

Update: 2024-05-17 14:42 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. సలార్ విజయం సాధించడంతో అదే ఫామ్‌లో మూడు నాలుగు సినిమాలు ప్రకటించాడు. అయితే ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో డార్లింగ్ ‘కల్కిఏడి 2898’ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులే అవుతుంది. జూన్ 27 థియేటర్స్‌లో విడుదల కానుంది.

తక్కువ సమయం ఉన్నప్పటికీ కల్కి అప్డేట్స్ మాత్రం రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా ఉండరు. కానీ నేడు తన లైఫ్‌లోకి ఓ స్పెషల్ పర్సన్ రాబోతుందంటూ ప్రకటించడంతో అది చూసిన వారంతా ఒక్కసారిగా అయోమయంలో పడిపోయారు. పెళ్లి గురించి చెప్పాడని పుకార్లు జోరందుకున్నాయి.

తాజాగా, దీనిపై ప్రభాస్ మరో పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. కల్కి పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘‘డార్లింగ్స్.. నేను నా బుజ్జిని కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్నాను’’ అనే క్యాప్షన్ జత చేశాడు. అయితే కల్కిలో ఓ మెషిన్ కూడా ఉంటుందట. దాని పేరే బుజ్జి అని తెలుస్తోంది. అయితే దీనిని రేపు మే 18న సాయంత్రం 5 గంటలకు పరిచయం చేయబోతున్నారట మేకర్స్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లకు ఏదో ఒక అప్డేట్ అయితే ఇచ్చారుగా అని కామెంట్లు పెడుతున్నారు.


 




Similar News