అవకాశాలు లేనప్పుడు డబ్బు కోసం ఆ పనులు చేయడంలో తప్పేముంది? పూజకు సలహా ఇచ్చిన ఇలియానా..
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన పూజా హెగ్డే ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయింది.
దిశ, సినిమా: ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన పూజా హెగ్డే ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయింది. అయితే సినిమాల్లో అవకాశాలు లేని చాలా మంది నటీనటులు వెబ్ సిరీస్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. కొందరు బోల్డ్‌గా రెచ్చిపోతుంటే.. మరి కొందరు లేడీ ఓరియెంటెడ్ కథలతో అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పూజకు ఒక వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ మొత్తం రొమాంటిక్ సన్నివేశాలతో నిండిపోయి ఉంటుందని టాక్. దీంతో కథ విన్న బ్యూటీ.. ఇలాంటి ప్రాజెక్ట్స్‌లో నటించనని చెప్పేసిందట.
కానీ ఆ డైరెక్టర్ నటి ఇలియానాకు మంచి ఫ్రెండ్ కావడంతో పూజను ఒప్పించే ప్రయత్నం చేసిందట గోవా బ్యూటీ. ‘అవకాశాలు లేనప్పుడు ఇలాంటి వెబ్ సిరీస్‌లో చేస్తే తప్పేముంది. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు.. రెండూ లభిస్తాయి కదా’ అని బలవంతం చేసిందట. కానీ డబ్బు కోసం ఇలాంటి చెత్త వెబ్ సిరీస్ చేయనని పూజా హెగ్డే ఖరాకండిగా చెప్పేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.