ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేస్తున్న.. ప్రభాస్ కామెంట్స్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’.

Update: 2024-06-24 09:03 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. దీపిక పదుకుణె, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. ఈ మూవీ జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇంకా రిలీజ్ సమయం కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో.. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతే కాకుండా బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాలకే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్.

ఈక్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా.. ప్రమోషన్స్‌లో భాగంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, ప్రియాంక దత్, స్వప్న దత్‌లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘బాహుబలి’ తర్వాత మళ్లీ కామెడీ ఈ సినిమాలోనే చేస్తున్నాను. అలాగే ఈ మూవీలో నేను చేసిన భైరవ పాత్రలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. మొదటిసారి నేను ఇలాంటి పాత్ర చెస్తున్నాను. ఇది నా కెరీర్‌లోనే దీ బెస్ట్’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. మూవీపై మరింత హైప్ పెరుగిపోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 


Similar News