ఆందోళనలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ఇక సినిమాలకు దూరం అవుతారంటూ..

ఓ వైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జనసేనాని ఘన విజయం సాధించారు.

Update: 2024-06-04 13:41 GMT

దిశ, సినిమా : ఓ వైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జనసేనాని ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి వైసీపీ ప్రత్యర్థి వంగా గీతపై దాదాపు భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఇటు జనసేన కార్యకర్తలు, అటు పవన్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఓ వైపు పవర్ స్టార్ గెలుపును ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్.. మరో వైపు ఆందోళన పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే.. రాజకీయాలకంటే కూడా.. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్‌కు సినిమాల పరంగానే అత్యధిక మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక నుంచి రాజకీయాల్లో బిజీ అయిపోయి, ఇక నుంచి సినిమాలకు దూరం అవుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సినీ లవర్స్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పొలిటీషియన్‌గా ఉన్నా సరే.. పవన్ సినిమాల్లో కూడా నటించాలని ఆయన అభిమానుల్లో అత్యధిక మంది భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. 


Similar News