మహేష్ బాబుకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కూడా విష్ చేశాడు. మహేష్, పవన్‌ల

Update: 2023-08-09 08:22 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కూడా విష్ చేశాడు. మహేష్, పవన్‌ల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. కాగా ‘తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణగారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రలో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదరసమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు పవన్. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Read More : Pawan Kalyan-Mahesh Babu.. క్రేజీ ఫొటో వైరల్ 

Tags:    

Similar News