Raghav-Parineeti Chopra : పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఏప్రిల్ 10న అనౌన్స్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి విషయం మరోసారి చర్చనీయాంశమైంది.
దిశ, సినిమా : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి విషయం మరోసారి చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. త్వరలోనే తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకునేందుకు వారిద్దరూ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ జోడి ఏప్రిల్ 10న జరిగే ఈ వేడుక అనంతరం తమ రిలేషన్‌పై అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయని టాక్. అంతేకాదు ఈ నిశ్చితార్థం ముగియగానే పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకోబోతున్నారని, ఈ కారణంగానే పరిణీతి పలు ప్రాజెక్టుల షూటింగ్స్ వాయిదా వేసుకుందట. ఇక దీనిపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: