భారత్‌లో పాకిస్థాన్ క్రికెట్ టీం.. షారూక్ ఖాన్ డైరెక్టర్ సంచలన ట్వీట్!

ఐసీసీ వరల్డ్ కప్-2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2023-09-30 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ వరల్డ్ కప్-2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా శుక్రవారం జరిగిన పాకిస్తాన్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఇక, పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ లో పర్యటిస్తున్న వేళ షారూఖ్ ఖాన్ ‘రాయిస్’ మూవీ డైరెక్టర్ రాహుల్ ఢొలాకియా సంచలన ట్వీట్ చేశారు. పాకిస్తాన్ యాక్టర్లను, మ్యూజిషియన్లను సైతం భారత్‌లో‌కి అనుమతించాలని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘పాకిస్తాన్ క్రికెటర్లు అఫీషియల్‌గా ఇక్కడ ఉన్నారు.

పాకిస్తానీ నటులను సైతం మన చిత్రాల్లో నటించేందుకు ఆహ్వానించాలని, మ్యూజిషియన్లను ఇక్కడ తమ ప్రతిభ చాటుకునేందుకు అనుమతి కల్పించాలన్నారు. ఇక ఈ పోస్ట్ కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘ఎందుకు ఇండియాలో యాక్టర్స్, సింగర్స్ లేరా? అని ప్రశ్నించాడు. మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘ఇతర దేశాల వారిని ఆహ్వానించే ముందు దేశంలోనే అబ్బురపరిచే టాలెంట్ ఉందని.. వారికి తొలుత ఛాన్స్ ఇవ్వండి’ అంటూ రాసుకొచ్చాడు. అయితే ‘రాయీస్’ సినిమాలో పాకిస్తాన్ నటి మహీరా ఖాన్‌కు ఆయన హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా రిలీజ్‌కు కొన్ని నెలల ముందే ఉరి ఎటాక్ జరగగా అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ ఆర్టిస్ట్‌లపై ఆ ఘటన తర్వాత మన దేశంలో బ్యాన్ విధించారు.


Similar News