అక్కడ హీరోలకు మాత్రమే విలువ.. సౌత్ ఇండస్ట్రీపై తమన్న షాకింగ్ కామెంట్స్
ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలు చేసి గుర్తింపు, డబ్బు సంపాదించుకుని మరో ఇండస్ట్రీకి వెళ్లిపోయిన నటీమణులు సౌత్‌పై విమర్శలు చేయడం కామన్‌గా మారింది.
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలు చేసి గుర్తింపు, డబ్బు సంపాదించుకుని మరో ఇండస్ట్రీకి వెళ్లిపోయిన నటీమణులు సౌత్‌పై విమర్శలు చేయడం కామన్‌గా మారింది. ఇప్పటివరకు ఇలియాన, రాశిఖన్నా, పూజాహెగ్దె, తాప్సీ లాంటి వారు నెగెటీవ్ కామెంట్స్ చేయగా ఈ జాబితాలోకి తమన్న కూడా చేరింది. తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమన్న ప్రజంట్ దక్షిణాది, బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ వైరల్ కామెంట్స్ చేసింది. ‘నటి కావాలనే ఆశతో పరిశ్రమలోకి అడుగుపెట్టాను. స్టార్‌ను అయ్యాను. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం శ్రమిస్తూనే ఉంటాను. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు వదిలేసుకోవడానికి ఒక కారణం ఉంది. అక్కడ పురుషాధిక్యతను సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంత కష్టపడిన హీరోయిన్‌లను మాత్రం పట్టించుకోరు’ అంటూ చెప్పుకొచ్చింది.