'Okkadu' మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ నుంచి కొలీవుడ్ వరకు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న, పెద్ద హీరోలు తేడా లేకుండా అభిమానుల కోరిక మేరకు హిట్ మూవీస్ రీ రిలీజ్ అవుతున్నాయి.

Update: 2022-12-13 10:47 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి కొలీవుడ్ వరకు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న, పెద్ద హీరోలు తేడా లేకుండా అభిమానుల కోరిక మేరకు హిట్ మూవీస్ రీ రిలీజ్ అవుతున్నాయి. ఇందులో భాగంగా మ‌హేష్‌బాబు హీరోగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన 'ఒక్కడు' సినిమా 2023 జ‌న‌వ‌రి 7న రీ రిలీజ్ కానుంది. ఇది విడుద‌లై 20 ఏండ్లు పూర్తయి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో స్పెష‌ల్ షోస్ ప్రద‌ర్శించ‌బోతున్నారు. ఈ మూవీ 2003 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న రిలీజైంది. ఇక రీ రిలీజ్ కూడా సంక్రాంతి సీజన్‌లో విడుదలవుతుండటంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే మ‌హేష్‌ బాబుకు అచ్చొచ్చిన పండుగ‌ల్లో సంక్రాంతి ఒక‌టి. ఈ ఫెస్టివల్కు రిలీజైన తన సినిమాలు భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్స్‌గా నిలిచాయి. అందుకని మ‌రోసారి 'ఒక్కడు' మూవీతో సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మ‌హేష్‌బాబు.

Read more:

అండర్‌వేర్ లేకుండా బటక్స్ చూపించిన నటి.. బ్లూ ఫిల్మ్ కోసమేనంటూ 

Tags:    

Similar News