Devara Movie: ‘దేవర’ నుంచి ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ విడుదల
‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అనే క్యాప్షన్ పెట్టి పోస్టర్ విడుదల చేసారు.
దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ "దేవర". ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దివంగత నేత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా రానుంది. మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి రానుంది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పెద్ద హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అటు ప్రేక్షకుల్లో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ మూవీ రిలీజ్ కు నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎన్టీఆర్ కి సంబందించిన స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అనే క్యాప్షన్ పెట్టి పోస్టర్ విడుదల చేసారు.
ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. దీనిలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ మూవీలో ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేస్తున్నాడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మూవీ రిలీజ్ అయ్యే వరకు కానీ దీనిపై స్పష్టత తెలియదు. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్, లిరికల్ సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.