NTR 31: ప్రశాంత్ నీల్ మూవీపై అదిరిపోయే అప్డేట్.. నేను అప్పటి నుంచి రంగంలోకి దిగుతానంటున్న ఎన్టీఆర్

నేను అప్పటి నుంచి రంగంలోకి దిగుతానంటున్న ఎన్టీఆర్

Update: 2024-09-21 04:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యంగ్ టైగర్ దేవర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27 న విడుదల కానుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ చేయబోయే నెక్ట్ ప్రాజెక్ట్ ల పైన ఉంది. వాటిలో 'KGF' మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ మూవీ రూపొందనున్న మనకీ విషయం తెలిసిందే. 'NTR31' అనే వర్కింగ్ టైటిల్ తో మన ముందుకు రాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇక ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది?  షూటింగ్ ఎప్పటి నుంచి  స్టార్ట్ అవుతుందా..  అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇక,  తాజాగా ‘దేవర’ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్‌ ఈ మూవీ గురించి చిన్న అప్డేట్ ఇచ్చారు. " ప్రశాంత్‌నీల్‌ తో చేయబోయే మూవీ అక్టోబర్‌ 21 నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. మొదటి షెడ్యూల్‌ 40 రోజులు జరుగనుంది. దానిలో నా సీన్స్ లేవు.. నా కో యాక్టర్స్ సంబంధించిన సీన్లు చిత్రీకరిస్తారు. నేను జనవరి నుంచి షూటింగ్‌లో జాయిన్ అవుతానంటూ" తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ ని చూసినట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    

Similar News