పవిత్రపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టి నరేష్.. పక్కనుంటే ఆ పని చేయాల్సిన అవసరం లేదంటూ..
పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరి గత కొన్ని రోజుల నుంచి రిలేషన్లో ఉంటున్నారంటూ ఆ మధ్య అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతే కాదు వీరు పెళ్లి చేసుకున్నారంటూ
దిశ, సినిమా : పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరి గత కొన్ని రోజుల నుంచి రిలేషన్లో ఉంటున్నారంటూ ఆ మధ్య అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతే కాదు వీరు పెళ్లి చేసుకున్నారంటూ కూడా ఓ వార్త ఇప్పటికీ చెక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక వీరిద్దరు ఒకరిని ఒకరు ఎంతగానో ఇష్టపడుతారు. చాలా సార్లు నరేష్ పవిత్రపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూనే వచ్చారు. పవిత్ర ఉంటే చాలా ధైర్యంగా అనిపిస్తుందని ఆయన పలు ఇంటర్వ్యూలలో ఓపెన్‌గా చెప్పుకొచ్చారు.
తాజాగా ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఓ ఇంటర్యూలో పాల్గొన్న నరేష్ పవిత్రపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. పవిత్ర పక్కన ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక అమ్మ, చెల్లి, ఫ్రెండ్ , సపోర్టర్‌గా అన్ని విధాలా తాను నన్ను ప్రేమగా చూసుకుంటుంది. ఒకప్పుడు పార్టీలని తిరిగేవాడిని కానీ ఇప్పుడు షూటింగ్ ఇల్లు అంతే, ఎవరితో పని లేదు. అలా మార్చేసింది నన్ను. పవిత్ర నా పక్కన ఉంటే మరొకరిని చూడాల్సిన అవసరం కూడా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నరేష్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.