Nanu Mattu Gunda 2: ఆ సినిమాలో డబ్బింగ్ చెప్పిన కుక్క.. ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్!

సినిమాల్లో ఆకట్టుకునే డైలాగులు, అలరించే డబ్బింగులు ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రతీ సన్నివేశానికి ఒక ప్రయారిటీ ఉంటుంది.

Update: 2024-08-14 08:55 GMT

దిశ, సినిమా : సినిమాల్లో ఆకట్టుకునే డైలాగులు, అలరించే డబ్బింగులు ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రతీ సన్నివేశానికి ఒక ప్రయారిటీ ఉంటుంది. అందుకు తగిన మాటలు, పాటలు కూడా ఉంటాయి. అవన్నీ ఆకట్టుకోవడం వెనుక డబ్బింగ్ ఆర్టిస్టులు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఇక్కడ డబ్బింగ్ చెప్పేది మనుషులు మాత్రమే. కానీ కుక్కలు కూడా డబ్బింగ్ చెప్తాయని మీకు తెలుసా?.. ఇప్పుడదే జరిగింది.

నిజానికి సినిమాలు తీయడం చూసినంత సులువు కాదు. వాటిలో నటనకు సంబంధించిన అనేక కోణాలు ఉంటాయి. మనుషులు, జంతువులకు మధ్య బాండింగ్ కూడా ముఖ్యమే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మొదలు కొని హాలీవుడ్ వరకు అనేక మూవీస్ వచ్చాయి. ‘777 చార్లీ’ ‘నాను మత్తు గుండా’ వంటి మూవీస్ ఇప్పటికే కోలీవుడ్ ఇండస్త్రీలో దర్శనమిచ్చాయి. ఫేమస్ డైరెక్టర్ రఘ హాసన్ దర్శకత్వం వహించిన ‘నాను మత్తు గుండా’ అయితే జంతు ప్రేమికులను బాగా ఆకట్టుకుంది. ఇక దీనికి సీక్వెల్‌గా రెండో భాగం కూడా ఇప్పుడు రాబోతోంది. స్పెషాలిటీ ఏంటంటే.. రాకేష్ అడిగా నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ స్టేజ్‌లో ఉండగా ఇందులో ‘సింబా’ అనే ఒక కుక్క కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించింది.

సాధారణంగా మనుషులు డైలాగులు, డబ్బింగులు చెప్పడం సహజమే కానీ.. ‘నాను మత్తు గుండా’ రెండో భాగంలో కుక్క పాత్రకు మరో కుక్క డబ్బింగ్ చెప్పింది. అది చెవిలో హెడ్‌ ఫోన్ పెట్టుకొని రికార్డింగ్ మైక్ ముందు కూర్చొని చెప్పిన డబ్బింగ్‌ను మేకర్స్ రికార్డ్ చేయగా ఇప్పుడది సోసల్ మీడియాలో వైరల్ అవుతుండగా రీసెంట్‌గా దర్శకుడు రఘ హాసన్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యాడు.. ఆయన మాట్లాడుతూ.. ‘సింబ’ అనే కుక్క వాయిస్ తన సినిమా మొత్తంలో ఉంటుందని, ఇలా కుక్కతో డబ్బింగ్ చెప్పించడం ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ అని పేర్కొన్నాడు. కాగా పోయెమ్ పిక్చర్స్ బ్యానర్‌పై రఘహాసన్ నిర్మిస్తున్న ఈ మూవీకి ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించాడు. కన్నడతోపాటు మరో ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీలో కుక్క డబ్బింగ్ చెప్పిన వీడియో ప్రజెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

Full View

Video Credits to ‘poem pictures’ YouTube channel

Tags:    

Similar News