చిరు చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ అయిన #Nani30
ఈ కార్యక్రమంలో పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు.
దిశ, సినిమా: 'దసరా'లో రగ్డ్ లుక్‌లో కనిపించిన నేచురల్ స్టార్ నాని, నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఒక అమ్మాయికి తండ్రిగా క్లాస్ అండ్ కూల్ లుక్‌లో రానున్నాడు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి, మూర్తి KS నిర్మించబోయే ఈ సినిమా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ముహూర్తపు షాట్‌కి మెగాస్టార్ చిరంజీవి కెమెరా స్విచాన్ చేయగా, అశ్వినీదత్ క్లాప్ కొట్టారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ తొలి షాట్‌కి దర్శకత్వం వహించగా, విజయేంద్ర ప్రసాద్ మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఇక నాని సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.