Samantha .Naga Chaitanya విడాకులు రద్దు చేయించనున్న నాగార్జున..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
దిశ, సినిమా : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయం తెలిసిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ఆమెకు అండగా నిలబడిన సంగతి తెలిసిందే. ఇక సామ్ పరిస్థితి గురించి తెలుసుకున్న ఆమె మాజీ భర్త నాగ చైతన్య కూడా టెన్షన్ పడ్డాడట. కాస్త ఆలస్యమైనప్పటికీ పాత విషయాలేం అలోచించకుండా ఆస్పత్రికి వెళ్లాడని టాక్.
అంతేకాదు తనను అలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయిన చైతు.. సామ్‌ను ఓదార్చడంతో పాటు ఆమె పేరెంట్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడని సమాచారం. ఇదిలా ఉంటే.. సమంతతో విడాకులను రద్దు చేసుకోవాలని నాగార్జున నాగ చైతన్యకు చెప్పినట్లు తెలుస్తోంది. 'సమంతకు ఇలాంటి పరిస్థితుల్లో తోడు అవసరం. ఆమె మనసుకు దగ్గరైన వాడివి నువ్వే కాబట్టి నీ వల్లే అది సాధ్యం. అవసరమైతే విడాకులు క్యాన్సిల్ చేసుకో. నేను వాళ్ల ఫ్యామిలీతో మాట్లాడతా' అని నాగార్జున చెప్పారట. దీనికి నాగచైతన్య కూడా ఓకే అన్నట్టు టాక్ వినిపిస్తున్నాయి. మరి దీనికి సమంత, ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? అనేది తెలియాలి.
Read more: