Nagarjuna: కొండా సురేఖ పై న్యాయపోరాటానికి సిద్దమైన నాగార్జున

న్యాయపోరాటానికి సిద్దమైన నాగార్జున

Update: 2024-10-03 06:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : బుధవారం గాంధీభవన్ లో కొండా సురేఖ సమంత పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ రోజు ఉదయం ఆమె చేసిన వ్యాఖ్యలును వెనక్కి తీసుకుని సమంతకు క్షమాపణలు చెప్పారు. కేటీఆర్ ని విమర్శించే నేపథ్యంలో నటి సమంత విడాకులును తెర పైకి తెచ్చి చేశారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం ఏకమైయి మండిపడుతున్నారు. తాజాగా దీని పై  కొండా సురేఖ మీడియాకి క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. " కేటీఆర్‌ నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆవేదనతోనే ఇలా మాట్లాడానని " మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే, దీనిపై ఫైర్ అయిన నాగార్జున లీగల్ నోటీసులు పంపించి, న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. 

Tags:    

Similar News