నాగచైతన్య వద్దు అన్నా ఆ పని చేసిన సమంత.. విడాకులకు ఇది కూడా కారణమా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో శర్వానంద్‌తో కలిసి నటించిన సినిమా జాను. ఈ మూవీ విడుదలై అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే మజిలీ , ఓబేబీ మంచి సక్సెస్ తర్వాత సమంతకు ఫ్లాప్

Update: 2024-07-14 13:34 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో శర్వానంద్‌తో కలిసి నటించిన సినిమా జాను. ఈ మూవీ విడుదలై అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే మజిలీ , ఓబేబీ మంచి సక్సెస్ తర్వాత సమంతకు ఫ్లాప్ ఇచ్చిన సినిమా ఇదేనంట.

అయితే ఈ సినిమా ముందుగా నాగచైతన్య, సమంతతో తెరకెక్కించాలని దిల్ రాజు అనుకున్నాడంట. దీంతో ఈ కథ ఇద్దరికీ వినిపించడంతో చైతూకి స్టోరీ నచ్చకపోవడంతో చేయను అని చెప్పాడంట. కానీ సమంత మాత్రం కావాలని పట్టు బట్టి ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నదంట. చైతూ చాలా చెప్పాడంట,అస్సలే వద్దు అని కానీ చై మాట లెక్కచేయకుండా సమంత ఆ మూవీ ఒకే చేసిందంట. కానీ రిజల్ట్ చూసే సరికి మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే వీరి విడాకులకు ఇది కూడా కారణం అంటున్నారు కొందరు. సమంత,నాగచైతన్యను అస్సలే పట్టించుకోకుండా, తనకు నచ్చేది చేసేది ఆ విషయంలో చైకి చాలా కోపం వచ్చేది. దీంతో ఈ విషయంలో ఇద్దరికీ చాలా గొడవలు అయ్యేది. విడాకులకు ఇది కూడా ఓ రీజన్ అంటున్నారు పలువురు.


Similar News