Samantha కు Naga Chaitanya కాల్.. సామ్ రియాక్షన్ ఇదేనంట!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తాను మయోసైటీస్ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఇక గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, తనకు మయోసైటీస్
దిశ, వెబ్డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తాను మయోసైటీస్ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఇక గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, తనకు మయోసైటీస్ వ్యాధి సోకిందని, దానిగురించే చికిత్స తీసకుంటున్నట్లు తమ అభిమానులకు తెలిజేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, సమంతకు ధైర్యం చెబుతున్నారు. ఇక అక్కినేని అకిల్, మాజీ వదిన సమంతకు అండగా నిలిచి ధైర్యం చెబుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, సమంత వ్యాధిపై ఇప్పటివరకు నాగచైతన్య కానీ, నాగార్జున కానీ స్పందించలేదు.
దీంతో అనేక రూమర్స్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. నాగచైతన్య, నాగర్జున కలిసి సమంతను కలవబోతున్నారు అంటూ ఓ రూమర్ వైరల్ కాగా, తాజాగా సమంత మాజీ భర్త, నాగచైతన్య సామ్కి కాల్ చేసినట్లు ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. చై సామ్కి కాల్ చేసి మాట్లాడి, సమంతకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సమంత చైతన్యపై కస్సుబుస్సులాడినా, చై అంటే విపరీతమైన ప్రేమ ఉందని, నాగచైతన్యకు కూడా అంతే ఉందని వ్యాధి నయం అయిన తర్వాత వీరు కలవబోతున్నారంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్గా మారింది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
Read more :
1.తారక్ సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా.. మహిళల పట్ల ఇంత గౌరవమా (వీడియో)