సమంతను బ్లాక్మెయిల్ చేసిన నాగచైతన్య.. సీక్రెట్స్ అన్నీ బయటపెడతానంటూ..
అక్కినేని నాగచైతన్య సమంత, ఏ మాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే ఇద్దరూ ప్రేమలో పడి, కుటుంబ సభ్యుల అంగీకారం తో మూడుముళ్ల ఒకటైన విషయం తెలిసిందే
దిశ, సినిమా : అక్కినేని నాగచైతన్య సమంత, ఏ మాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే ఇద్దరూ ప్రేమలో పడి, కుటుంబ సభ్యుల అంగీకారం తో మూడుముళ్ల ఒకటైన విషయం తెలిసిందే. ఇక కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఇక వీరు విడాకులు తీసుకొని విడిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు వీరికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది.అయితే తాజాగా సమంత సీక్రెట్స్ బయటపెడతానని నాగచైతన్య బ్లాక్ మెయిల్ చేశారంటూ ఓ వార్త తెగ ట్రోల్ అవుతోంది. కాగా, ఇది నిజమేనా? వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే వీరు ప్రేమలో ఉన్న సమయంలో వీరి మధ్య అలకలు,చిన్న చిన్న గొడవలు, క్షమాపణలు ఇలా చాలా ఉండేదంట. ఒకసారి సమంత నాగచైతన్య మీద అలిగింది. దీంతో చైతో సామ్ మాట్లాడటం మానేసింది. ఇక అది నచ్చని చైతూ, సమంతకి మెసేజ్ చేస్తూ.. నువ్వు గనుక ఇప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడకపోతే, మన ప్రేమ విషయం బయటకు చెప్పేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసేవాడంట. దీంతో భయపడిపోయిన సమంత, చెప్పకు నేను మాట్లాడుతానంటూ కాల్ చేసేది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.