అందంతో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

బ్యూటీ నభానటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది

Update: 2024-07-19 13:10 GMT

దిశ, సినిమా : బ్యూటీ నభానటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. చాందీని పాత్రలో తన గ్లామర్ నటనతో ఎంతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి మంచి మంచి ఆఫర్స్ వస్తాయని అందరూ అనుకున్నారు కానీ, ఆశించిన స్థాయిలో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేదు. డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్ సినిమాలో నటించి, మెప్పించింది. ఇప్పుడు డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయింది.

ఇక నభా ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా, ఈ ముద్దుగుమ్మ ట్రెండీ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలో ఇస్మార్ట్ బ్యూటీ స్టైలిష్‌గా, మరింత అందంగా కనిపిస్తుంది. కొంటె చూపు చూస్తూ కుర్రకారుకు చెమటలు పట్టించేలా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన తన అభిమానులు నభా అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News