ఆ పనికి అసలు వెనుకడుగేయరు.. అందుకే ముంబై హీరోయిన్స్ అంటే దర్శకులకు అంత స్పెషల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో అస్తమానం జరిగే వివాదం ఏంటంటే తెలుగు హీరోయిన్‌లను పక్కన పెట్టి.. ముంబై భామలను ఎంచుకోవడం.

Update: 2023-07-12 13:24 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో అస్తమానం జరిగే వివాదం ఏంటంటే తెలుగు హీరోయిన్‌లను పక్కన పెట్టి.. ముంబై భామలను ఎంచుకోవడం. ఈ విషయంలో చాలామంది తెలుగు హీరోయిన్స్ మీడియా ముందు గొడవకు దిగారు. కానీ దర్శకులు, నిర్మాతలు వారి చిత్రం హిట్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా హీరోయిన్ల విషయంలో కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉండాలని కోరుకుంటారు. అంటే తెలుగు హీరోయిన్లు మూవీలో కొన్ని సీన్లు చేయడానికి ఇష్టపడరు. చాలా కండిషన్స్ పెడుతుంటారు. ఒక లిప్ లాక్ సీన్ ఉంటే డైరెక్టర్ ఎంతో కన్విన్స్ చేస్తే కానీ చేయరు. ఒక్కోసారి హీరోయిన్ తల్లిదండ్రుల నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ ముంబై హీరోయిన్లు అలా కాదు. స్టోరీ, సీన్స్‌కు తగ్గట్టు పనిచేస్తుంటారు. ఎలాంటి సీన్ అయినా మొహమాటం లేకుండా చేస్తారు. ముఖ్యంగా వారు బాడీ సెన్స్, యాక్టింగ్, గ్రూమింగ్ విషయంలో లక్షలు పెట్టి శిక్షణ తీసుకుని ఉంటారు. అంటే తెలుగు వారిలో ఈ క్వాలిటీస్ ఉండవని కాదు. కానీ ఇప్పుడిప్పుడే మన తెలుగు హీరోయిన్లు కూడా డెవలప్ అవుతున్నారని చెప్పవచ్చు.

Tags:    

Similar News