రామ్ చరణ్, చీరంజీవితో మల్టీస్టారర్ సినిమా.. సాయి ధరమ్ తేజ్ రియాక్షన్ ఇదే!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.
దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటనతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. పలు హిట్స్ అందుకుని స్టార్ డమ్ దక్కించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అయితే సాయి ధరమ్‌కు యాక్సిడెంట్ కావడంతో కొద్ది కాలంపాటు సినిమాలకు దూరమయ్యాడు. మళ్లీ విరూపాక్ష మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
ప్రస్తుతం గాంజా శంకర్ షూటింగ్‌లో బిజీ అయిపోయాడు. ఇటీవల ఈ సినిమా టైటిల్ మార్చాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నోటీసులు జారీ చేయడంతో షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సాయి ధరమ్ తేజ్ కానీ అటు మేకర్స్ కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, కలర్ స్వాతి కలిసి సత్య షార్ట్ ఫిలిం చేసిన విషయం తెలిసిందే. ఇందులోంచి ఓ సాంగ్ కూడా రిలీజ్ అయింది. తాజాగా, మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ సత్య ప్రీమియర్ వేయడంతో పాటు ప్రెస్‌మీట్ పెట్టారు.
ఈ కార్యక్రమానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హాజరై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘నా పేరు మార్చుకున్నాను. నా తండ్రి ఇంటి పేరు ఎలాగో వస్తుంది. అయితే అమ్మ కూడా ఎప్పటికీ నాతో ఉండాలని ఆమె పేరును యాడ్ చేసుకున్నాను. సాయి దుర్గ తేజ అని పెట్టుకున్నాను. అలాగే అమ్మ దుర్గ పేరుతో ఓ ప్రొడక్షన్ బ్యానర్ ప్రారంభించాను అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఓ నెటిజన్ రామ్ చరణ్‌లో మల్టీస్టారర్ సినిమా చేస్తారా? అని ప్రశ్నించగా.. దానికి మెగా హీరో స్పందిస్తూ.. మెన్న బ్రో పవన్ కల్యాణ్‌తో చేశాను. అంతకుముందు నాగబాబుతో చేశాను. నా నెక్ట్స్ టార్గెట్ మెగాస్టార్ చిరంజీవి మావయ్య ఆ తర్వాత మిగతావాళ్లతో చేస్తాను’’ అని తెలిపాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.