ఒక్క క్లిక్ దూరంలో పోర్న్ స్టార్ బండారం.. ఒంటరితనం వేధిస్తే..

దిశ, సినిమా : ఎక్స్‌ పోర్న్ స్టార్ మియా ఖలీఫా లోన్లీగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టిన తర్వాత ఒంటరితనం వేధిస్తోందని, ఆందోళన ఎక్కువైపోయిందని చెప్పింది..Latest Telugu News

Update: 2022-06-15 08:00 GMT

దిశ, సినిమా : ఎక్స్‌ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ( Mia Khalifa )  లోన్లీగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టిన తర్వాత ఒంటరితనం వేధిస్తోందని, ఆందోళన ఎక్కువైపోయిందని చెప్పింది. పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు తెలియకుండానే పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పింది.

తనను ఎవరు ఏ విధంగా జడ్జ్ చేస్తారోననే భయం వెంటాడుతోందని.. ప్రైవసీ రైట్ కోల్పోయినట్లుగా అనిపిస్తోందని తెలిపింది. ఎందుకంటే గూగుల్ సెర్చ్‌లో ఒక్క క్లిక్ దూరంలో తన పోర్న్ వీడియోలు అవెలబుల్‌లో ఉంటాయన్న ఆమె.. ఈ అశ్లీల వీడియోల కారణంగా ప్రపంచంతో మాత్రమే కాదు సొంత కుటుంబం, చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా దూరమయ్యానని బాధపడింది. కొన్ని తప్పులు క్షమించరానివని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందన్న మియా.. కాలమే ఈ గాయాలను నయం చేస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. 


Similar News