Megha Akash: ‘మెహందీ డే’ అంటూ కాబోయే భర్తతో ఫొటోలు షేర్ చేసిన క్యూట్ హీరోయిన్

ఒరు పక్క కథై అనే తమిళ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మేఘా ఆకాష్.

Update: 2024-09-14 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒరు పక్క కథై అనే తమిళ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మేఘా ఆకాష్. తన క్యూట్ నెస్, అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తర్వాత ఈ బ్యూటీ అబద్ధం, చల్ మోహన్ రంగ, పెట్టా, వంత రాజవతాన్ వరువేన్, బూమరాంగ్, ఎనై నోకి పాయుమ్ తోట, కుట్టి కథ, రాధే, రాజ రాజ చోర, ప్రియమైన మేఘా, గుర్తుండ సీతకాలం, ప్రేమదేశం, మను చరిత్ర, సబా నాయకన్, వడక్కుపట్టి రామసామి వంటి సినిమాల్లో అవకాశం కొట్టేసింది. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది మేఘా ఆకాష్.

ఇకపోతే హీరోయిన్ మేఘా ఆకాష్.. విష్ణు అనే వ్యక్తితో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇప్పటికీ కూడా వీరి నిశ్చితార్థం ఫొటోలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇక ఈ బ్యూటీ పెళ్లి పనులు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. మేఘా ఆకాష్ అండ్ విష్ణు పెళ్లి ఎక్కడ జరుగుతుందని వివరాలు తెలియనప్పటికీ.. నిన్న మెహందీ కార్యక్రమం మాత్రం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మెహందీ డే జరిగిందంటూ మేఘా ఆకాష్ కాబోయే హస్బెండ్‌తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో పంచుకుంది. కాగా పెళ్లి ఈ రెండ్రోజుల్లో జరగనుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మేఘా ఆకాష్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Full View


Similar News