మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా MBBS’ రీ రిలీజ్.. పబ్లిక్ టాక్ (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి, సోనాలీ బింద్రే కలిసి జంటగా నటించిన చిత్రం ‘శంకర్ దాదా ఎమ్‌బీబీ ఎస్’.
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, సోనాలీ బింద్రే కలిసి జంటగా నటించిన చిత్రం ‘శంకర్ దాదా MBBS’. దీనిని డైరెక్టర్ జయంత్ తెరకెక్కించారు. ఇందులో హీరో శ్రీకాంత్, శర్వానంద్, రోహిత్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో నటించాడు. ఈ మూవీ 2004 అక్టోబర్ 15న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా, ఈ సినిమాను మేకర్స్ నేడు రీ రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ థియేటర్స్ రచ్చ చేస్తున్నారు. అలాగే ఇందులో డాక్టర్స్‌కు సంబంధించిందే ఉంటుంది కాబట్టి మెడికల్ స్టూడెంట్స్ కూడా చూశారు. సూపర్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. అలాగే చిరంజీవి కోసం మళ్లీ మళ్లీ థియేటర్‌కి వచ్చి చూస్తామని అంటున్నారు.