‘అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌ డే చరణన్నలవ్ యూ’.. వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్

మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మెగా ఫ్యామిలీకి కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

Update: 2024-03-25 14:47 GMT

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మెగా ఫ్యామిలీకి కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందంతా మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం వల్లే వచ్చిందని చెప్పుకోవచ్చు. చిరుతో పాటు మెగా ఫ్యామిలీలోని వారసులను కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ.. వారిని గొప్ప స్థానంలో ఉంచుతున్నాడు. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన.. ‘నాగబాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్’ మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు.

అయితే తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘‘అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అన్న. లవ్ యు. ఎప్పటిలాగే నీవు ఎప్పటికి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నీ ప్రత్యేకమైన పుట్టిన రోజు’’ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.

ఇక రీసెంట్ గా డైరెక్టర్ ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేకపోయింది. ఈ సినిమాలో మనూషీ చిల్లర్ కథానాయికగా నటించింది. ఇకపోతే వరుణ్ తేజ్ గత ఏడాది టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లావణ్య-వరుణ్ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో బిజీ అయిపోయారు.

Tags:    

Similar News