మీనా రెండో పెళ్లి గురించి నిజాలు బయట పెట్టిన ఫ్రెండ్
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ గతేడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ గతేడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పూర్తిగా కృంగిపోయిన నటి.. తన కూతురికి బంగారు భవిష్యత్తు అందించేందుకు, జరిగిన విషాదాన్ని మరిచిపోయేందుకు తిరిగి మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే భర్త మరణం తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకోనుందని చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఈ పుకార్లపై నటి మాత్రం స్పందించలేదు. ఇక తాజాగా మీనా సెకండ్ మ్యారేజ్‌పై ఆమె స్నేహితురాలు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కాలా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నాకు మీనాతో, మీనా కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంది.
నేను, మీనా స్నేహితులు కాకుండా అక్కాచెల్లెళ్లలా ఉంటాము. విద్యా సాగర్ ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా మూడు నెలల పాటు మీనా దగ్గరే ఉన్నాను. భర్త చనిపోయాక మీనా డిప్రెషన్లోకి వెళ్లింది. తనను మామూలు స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఒకసారి మాటల్లో రెండో పెళ్లి చేసుకోమని ఆమెకు సలహా ఇచ్చాను. నాపై ఫైర్ అయింది. నాకు కూతురు ఉంది. తన బాధ్యత నా భుజాలపై ఉంది తనను చూసుకుంటూ ఉండిపోతా ఇలాంటి సలహాలు ఇచ్చినట్లయితే నువ్వు నాతో మాట్లాడొద్దని నా ముఖం మీద చెప్పింది’ అని తెలిపింది మీనా స్నేహితురాలు.