‘విజయ్69’లో మరో క్రేజీ బ్యూటీ.. పోస్ట్ వైరల్

‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-02 15:59 GMT

దిశ, సినిమా: ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇవే వార్తలను నిజం చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విజయ్ 69’. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీ నుంచి ఇటీవల పోస్టర్ కూడా రిలీజ్ చెయ్యగా.. నెట్టింట మంచి స్పందన లభించింది.

ఇదిలా ఉంటే.. ‘వియజ్ 69’ నటించే నటీనటుల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు మేకర్స్. కానీ, ఇప్పుడు వరుసగా అప్‌డేట్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలో పూజా హెగ్దే, బాబీ డియోల్నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మమితా బైజు కూడా తమ ప్రాజెక్ట్‌లో భాగం అయిందని తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ‘మినీ మహారాణి #MamithaBaiju #Thalapathy69 తారాగణంలో చేరిందని 'అధికారికంగా' ప్రకటిస్తునందుకు మేము సంతోషిస్తున్నాము’ అని తెలిపారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.


Similar News