అలాంటి వీడియోలు షేర్ చెయ్యొద్దని హెచ్చరించారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

విక్టరీ వెంకటేష్ ‘గురు’ చిత్రంతో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ రితికా సింగ్.. ప్రజెంట్ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘వెట్టైయాన్’ చిత్రంతో బిజీగా ఉంది.

Update: 2024-10-02 15:12 GMT

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ ‘గురు’ చిత్రంతో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ రితికా సింగ్.. ప్రజెంట్ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘వెట్టైయాన్’ చిత్రంతో బిజీగా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రితికా సింగ్ పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘సినీ ఇండస్ట్రీ అనే కాదు.. జీవితంలో కూడా ఎప్పుడైనా ఊహించని విధంగా ఇబ్బందులు ఎదురవుతాయి. దాని నుంచి తప్పించుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలి. అందుకోసమే నేను బాక్సింగ్, కరాటే నేర్చుకున్నా. వాటికి సంబంధించిన వీడియోలు కూడా తరచూ నెట్టింట షేర్ చేస్తుంటా. అయితే.. ఆ వీడియోలను చూసిన కొంతమంది.. అలాంటి వీడియోలు షేర్ చెయ్యొద్దు. నెటిజన్లు నిన్ను చూసి భయపడతారు అని చెప్పేవారు.

కానీ, నేను కేవలం బాక్సింగ్, కరాటే వీడియోలు మాత్రమే కాదు.. చీరతో ఉన్నవి, డ్యాన్సులు చేసిన వీడియోలు కూడా షేర్ చేస్తాను. నేను ఏదైనా చెయ్యగలను అని ఇంతకన్నా ఎలా చెప్పాలి. అయినా ఎవరో ఏదో అన్నారని నేను ఫైట్ వీడియోస్ షేర్ చెయ్యడం మానలేను. ఎందుకంటే అది నాకు ఇష్టమైన పని. ఇంత స్ట్రాంగ్‌గా ఉండటం మంచిది కాదని చాలా మంది సలహా ఇస్తుంటారు. అలా ఎందుకు ఉండకూడదు..? నేను భయటకు వెళ్లినప్పుడు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగింది. అప్పుడు నాకు ఎవరు సాయం చేస్తారు. నన్ను నేను రక్షించుకోవడానికి నాకంటూ కొన్ని బేసిక్స్ అయినా తెలిసి ఉండాలి కదా. అలాగే అందరూ మార్షల్ ఆర్టిస్టులు కావాల్సిన అవసరం లేదు. నీ గళాన్ని బయటకు చెప్పే ధైర్యం ఉండాలి. మన వాయిసే ఒక ఆయుధం లాంటిది. అటాక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం కచ్చితంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.


Similar News