నమ్రత కోసం సినిమా వదులుకున్న మహేశ్ బాబు.. ఇప్పుడా సినిమా కోసం ఇండస్ట్రీ వెయిటింగ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల ఎంపిక విషయంలో భార్య నమ్రత మాటే వింటండంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

Update: 2023-10-06 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల ఎంపిక విషయంలో భార్య నమ్రత మాటే వింటాడంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. నమ్రతకు కథ నచ్చితేనే మహేష్ బాబు సినిమాకు సైన్ చేస్తాడట. కానీ, సొంతంగా ఏ నిర్ణయం తీసుకోడని టాక్. అయితే, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్‌లో వస్తున్న ‘యానిమల్’ సినిమా స్టోరీని ముందుగా మహేష్ బాబుకి వివరించారట. ఆ కథ మన సూపర్ స్టార్‌కు నచ్చిందట. కానీ నమ్రతకు పెద్దగా నచ్చకపోవడంతో ‘ఈ స్టోరీ వద్దు. మీరు ఏదైనా ఇంకా వేరే స్టోరీ ఉంటే తీసుకురండి. మనం వేరే సినిమా చేద్దామని నమ్రత డైరెక్టర్‌తో చెప్పిందంట. దీంతో సందీప్ ఆ కథని బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌కు చెప్పి ఆయన్ను ఒప్పించాడట. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News