మహేశ్ బాబు.. చిన్నారుల గుండె ఆపరేషన్లు చేయించడానికి అసలు కారణం ఏంటో తెలిస్తే షాక్..!
సమాజ సేవ చేసే టాలీవుడ్‌లోని చాలా తక్కువ మంది హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు.
దిశ, వెబ్‌డెస్క్: సమాజ సేవ చేసే టాలీవుడ్‌లోని చాలా తక్కువ మంది హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు. వందలమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి జనాల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1057 మంది చిన్నారులను బతికించి రియల్ హీరో అనిపించుకున్నారు. అయితే.. వెయ్యి మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించే వరకూ ఈ విషయం బయటకు రాలేదు. ఇదిలా ఉండగా.. ప్రిన్స్ చిన్నారులకు ఇలా ప్రాణం పోయడానికి బలమైన కారణం దాగి ఉందట. మహేష్ బాబు.. నమ్రతల మొదటి సంతానం గౌతమ్ 6 నెలల ముందే జన్మించాడట.
చాలా తక్కువ వెయిట్‌తో జన్మించడమే కాకుండా.. చాలా రోజుల తర్వాత బతికాడట. 3 నెలల తర్వాత గౌతమ్ కోలుకున్నాడని స్వయంగా మహేషే బాలయ్య అన్ స్టాపబుల్ షోలో తెలిపారు. ‘మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎంతైనా ఖర్చు చేసి గౌతమ్‌ను కాపాడుకున్నాం. మరీ డబ్బులేనివారు.. చిన్నారులకు సమస్యలు వస్తే.. ఏంటి పరిస్థితి? అని ఆలోచిస్తే.. చాలా భయం వేసింది. ఆ బాధ నాకు తెలుసు. అందుకే ఆపరేషన్లు చేయిస్తున్నాను.’’ అని సూపర్ స్టార్ ఎమోషనల్‌గా వెల్లడించారు. ఇక నేడు ఈ ప్రిన్స్ బర్త్ డే రోజున ఎందరో సినీ, రాజకీయ నాయకులు విషెష్‌లు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.
Read More..
మహేష్ బాబుకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్
Happy birthday Mahesh Babu: మంత్రి కేటీఆర్ బర్త్ డే విషెస్..!